Reading Time: 2 minutes

Hanuman Ansh Telugu Release : తెలుగులో ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తుంది.. టాలీవుడ్‌లోనూ సంచలనం సృష్టిస్తుందా?

Caption of Image.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమా ‘హనుమాన్ అంశ్’ ఇండియన్ సినీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం రూ.2 కోట్ల బడ్టెట్ తో నిర్మించిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.  ఈ థియేటర్లలోకి వచ్చి 55 రోజులు దాటినా కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు.  ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ హనుమాన్ అంశ్’ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా  విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు  ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తొలుత ఈ సినిమాను సెప్టెంబర్ 18న తెలుగులో విడుదల చేసేందుకు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ బాధ్యతలు తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు.  ఇప్పుడు ఈ బాధ్యతలను హోంబలే ఫిల్మ్స్‌ తీసుకుంది.

 ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు  నీమ్ కరోలి బాబా దివ్య జీవిత చరిత్ర ( 1900- 73 ) ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త ఆధ్యాత్మిక , సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.  వీకెండ్ లో కూడా కలెక్షన్స్ పెద్ద చిత్రాలతో పోటీ పడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 

మరో వైపు అక్టోబర్ 9న విక్టరీ వెంకటేష్ –త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శకుటుంబం’, యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ‘హనుమాన్ అంశ్ ‘ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో .. టాలీవుడ్ చిత్రాలకు ఎలాంటి పోటీ ఇవ్వబోతుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.