
హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు బాపూఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
గాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్‌లో గాంధీజీ స్మారక స్థలాన్ని పుష్పాలతో అలంకరించారు. ఉదయం నుంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి గాంధీజీకి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.బాపూఘాట్‌లోని గాంధీజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం దేశానికి మహాత్మా గాంధీ అందించిన సేవలను స్మరించుకున్నారు. అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గంలో గాంధీజీ చూపిన బాటను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు.