
కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఓవర్ నైట్ హార్ట్ థ్రోబ్‌గా మారింది శ్రీనిధి శెట్టి. కానీ ఈ ఇమేజ్ దాటి రాలేకపోతుంది ఈ కన్నడ కస్తూరీ. కెరీర్ స్టార్ట్ చేసి ఎనిమిదేళ్లువుతున్నా.. పట్టుమని అరడజన్ సినిమాలు కూడా చేయలేదు. ఆమె కంటే వెనకొచ్చిన రుక్మిణీ వసంత్ పాన్ ఇండియా చిత్రాలతో పాపులారిటీని సంపాదిస్తుంటే.. శ్రీనిధి మాత్రం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తోంది. కేజీఎఫ్ తర్వాత తమిళంలో విక్రమ్ సరసన కోబ్రా చేసింది శ్రీనిధి శెట్టి. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మరో కోలీవుడ్ ఆఫర్ రాలేదు.
కానీ అదే టైంలో టాలీవుడ్ ఆమెను ఆదుకుంది. టాలీవుడ్ మాత్రం రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ అందించింది. నాని హిట్3తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మకు తొలి సినిమా యావరేజ్ రిజల్ట్ ఇచ్చింది. ఆ తర్వాత చేసిన సిద్దు జొన్నలగడ్డ తెలుసుకదా మూవీ డిజాస్టర్ కావడంతో ఆవిరైంది. ప్రజెంట్ వెంకీ- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబంలో నటిస్తోంది శ్రీనిధి శెట్టి. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ ఇదే. ఇందులో వెంకీకి భార్యగా కనిపించబోతోంది. అక్టోబర్9న రిలీజౌతున్న ఈ సినిమా గనుక హిట్ అయితే.. శ్రీనిధికి తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆదర్శ కుటుంబం ఈ కన్నడ కస్తూరీకి సరికొత్త ఐడెంటిటీని ఇస్తుందా..? చూద్దాం.