మేష రాశి : మేష రాశి వారికి గజకేసరి రాజయోగం వలన పట్టింది బంగారమే కానుంది. వీరికి ఈ యోగం సుఖస్థానంలో ఏర్పడుతోంది. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. తల్లి వైపు నుండి శుభవార్త వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.
కర్కాటక రాశి : గజకేసరి రాజయోగం కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. మీ రాశిలోనే ఈ యోగం ఏర్పడుతుండటంతో మీకు ఇది స్వర్ణయుగం లాంటిది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.
కుంభ రాశి :కుంభ రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అప్పులు తీరిపోతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. గురుడి అనుగ్రహం వలన అనుకున్న పనులను త్వరగా పూర్తి చేసుకుంటారు.
మిథున రాశి : మిథున రాశి వారికి ధనయోగం పట్టబోతోంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించి తీరాలి.




