Reading Time: < 1 minute

తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. సైన్ బోర్డుపై హిందీ పదాలు.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్

Caption of Image.

తమిళనాడులో ద్విభాషావిధానం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ద్విభాషా విధానాన్ని ఉల్లంఘిస్తూ రహదారి సైన్ బోర్డులలో హిందీ పదాలను వినియోగించడంపై ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. తమిళం, ఇంగ్లీషు పదాలు తప్పా ఏ ఇతర భాష ఉపయోగించకూడదని రాష్టంలో ద్విభాషా విధానాన్ని ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో  హెచ్చరించింది.

తమిళనాడు ద్విభాషా విధానం ప్రభుత్వ స్కూళ్లలో  తమిళం, ఇంగ్లీష్ భాషలను మాత్రమే బోధించే విద్యా విధానం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా విధానాన్ని ముఖ్యంగా హిందీ బలవంతపు రుద్డడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ఈ విధానాన్ని దశాబ్దాలుగా అమలు చేస్తోంది. 

1965లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల తర్వాత, 1968 జనవరి 23న అప్పటి సీఎం సి.ఎన్. అన్నాదురై నేతృత్వంలోని డిఎంకె (DMK) ప్రభుత్వం మద్రాసు అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం ప్రకారం స్కూళ్ల పాఠ్యప్రణాళిక నుంచి హిందీ, సంస్కృతం వంటి ఇతర భాషలను తొలగించి, కేవలం తమిళం, ఇంగ్లీష్‌లను మాత్రమే అధికారిక బోధనా భాషలుగా ఖరారు చేశారు. ఇప్పటివరకు తమిళనాడులో ఏ ప్రభుత్వం వచ్చినా అదే విధానాన్ని అమలు చేస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.