
న్యూఢిల్లీ:హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా అనూప్ బాగ్చీ నియమితులయ్యారు. మూడేళ్ల కాలపరిమితికి ఆర్బీఐ ఆయన నియామకాన్ని, వేతనాన్ని ఆమోదించింది. ఈ పదవీకాలం 2026 అక్టోబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంక్ బోర్డు సమావేశంలో శుక్రవారం నుంచి ఆయనను అదనపు డైరెక్టర్‌గానూ నియమించారు.
బాగ్చీ ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓగా పనిచేస్తున్నారు. 2023 జూన్ నుంచి ఆయన ఈ బాధ్యతల్లో ఉన్నారు. దాదాపు 30 ఏళ్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో పనిచేసిన ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్ రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ మేనేజ్మెంట్లో మార్పులు జరిగాయి.
గత నెల జిమ్మీ టాటాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, శ్రీనివాస రంగన్‌ను హోల్‌టైమ్ డైరెక్టర్‌గా బ్యాంక్ తిరిగి నియమించింది. ఈ ఏడాది జూన్ 29న రాజీవ్ కుమార్ పార్ట్‌టైం చైర్మన్‌గా నియమితులయ్యారు.