
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్ గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. LIC క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా అంచెలంచెలుగా ఎదిగిన కల్కి.. వన్నెస్ ఉద్యమాన్ని , ఏకం క్యాంపస్‌ను స్థాపించారు. భక్తుల సందర్శానార్థం ఆయన పార్థివ దేహాన్ని ఇవాళ(బుధవారం) తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏకం క్షేత్రంలో ఉంచారు.
1949 మార్చి 7న తమిళనాడులో జన్మించిన విజయ్ కుమార్ నాయుడు, చెన్నైలోని డిజి వైష్ణవ్ కళాశాలలో విద్యను పూర్తి చేసి, ప్రారంభంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో క్లర్క్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి, చివరికి ఏకత్వ ఉద్యమాన్ని స్థాపించారు.
కల్కి భగవాన్ తన ఆధ్యాత్మిక బోధనలు, ధ్యాన కార్యక్రమాలు , ఏకత్వ దీక్షల ద్వారా ప్రాముఖ్యతను పొందారు. భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా ఆయన అనుచరులను సంపాదించారు.