Reading Time: < 1 minute

సీఎం రేవంత్ కరీంనగర్ జిల్లా పర్యటన.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. కొత్త కలెక్టరేట్ ప్రారంభం

Caption of Image.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి 2026 సెప్టెంబర్ 30వ తేదీన కరీంనగర్ చేరుకున్నారు. గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన సీఎం.. కలెక్టరే భవన్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాతర కలెక్టర్ భవనాల సముదాయన్ని ప్రారంభించారు. 

కలెక్టరేట్ ప్రారంభం తర్వాత కొత్త కలెక్టరేట్ లో కలెక్టర్ చిత్రా మిశ్రాను కుర్చీలో ఆసీనురాలిని చేశారు సీఎం.  కాన్ఫరెన్స్ హాల్‌‌‌‌‌‌‌‌లో జిల్లా సమగ్ర అభివృద్ధిపై జిల్లా అధికారులతో  సమీక్ష నిర్వహించారు. 

కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో  సీఎం రేవంత్ తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అదేవిధంగా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు  సీఎంతో పాటు కలెక్టరేట్ కు వచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. అంతకు ముందు కలెక్టరేట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ దాదాపు పది నిమిషాల పాటు ముచ్చటించారు. 

►ALSO READ | 19 ఏళ్ల వయసులో పారిపోయిన కొడుకు.. 23 ఏళ్ల తర్వాత వచ్చిన వారసుడు.. ఇబ్రహీంపట్నంలో భలే ట్విస్టు!

సాయంత్రం సిరిసిల్లలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం. ఈ సభకు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో 100 బస్సులు, 100 కార్లలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అటు సీఎం సభకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు.  దీంతో సిరిసిల్ల కాంగ్రెస్ జెండాలతో, కార్యకర్తల కదనోత్సాహంతో మారుమోగిపోతోంది. 

©️ VIL Media Pvt Ltd.