Reading Time: < 1 minute

సిద్దిపేట జిల్లా చేర్యాల పెద్ద చెరువుకు గోదావరి జలాలు

Caption of Image.

చేర్యాల, వెలుగు: తపాస్​పల్లి రిజర్వాయర్​ నుంచి సిద్దిపేట జిల్లా  చేర్యాల పెద్ద చెరువుకు గోదావరి జలాలు వచ్చాయి. గురువారం చేర్యాల పెద్ద చెరువుకు గోదావరి జలాలు విడుదలైన సందర్భంగా కాంగ్రెస్  పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్  ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంత ప్రజల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద చెరువుకు గోదావరి జలాలను తీసుకురావడం హర్షణీయమన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్​చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉంటే బీఆర్ఎస్​ నాయకులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి కృషితోనే గోదావరి జలాలు చేర్యాలకు వచ్చాయని పేర్కొంటూ ప్రత్యేక పూజలు చేశారు.

©️ VIL Media Pvt Ltd.