Reading Time: < 1 minute

బంగారు బాణాలు.. కాంపౌండ్ ఆర్చరీలో ఇండియా హ్యాట్రిక్‌‌‌‌

Caption of Image.
  • మూడు స్వర్ణాలతో పాటు లాస్‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌ ఒలింపిక్స్​ కోటా
  • తెలంగాణ ఆర్చర్‌‌‌‌ చికితాకు రెండు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌
  • కైనన్‌‌‌‌ చినాయ్‌‌‌‌–నీరూ దండా జోడీకి స్వర్ణం

నగోయా: ఆసియా క్రీడల్లో ఇండియా ఆర్చర్ల గురి అదిరింది.  కాంపౌండ్ విభాగంలో మూడు స్వర్ణాలతో క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేయడంతో పాటు 2028 లాస్‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ కోటాను దక్కించుకున్నారు. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఫైనల్లో తెలంగాణ ఆర్చర్‌‌‌‌ చికిత తానిపర్తి–జ్యోతి సురేఖ వెన్నం–ప్రీతిక ప్రదీప్‌‌‌‌తో కూడిన ఇండియా త్రయం 238–234 తేడాతో వునియర్‌‌‌‌–యు వాంగ్‌‌‌‌–ఫాంగ్యావో వీ (చైనా)పై సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో సౌత్‌‌‌‌ కొరియా పేరిట ఉన్న వరల్డ్‌‌‌‌ రికార్డు స్కోరు (238)ను సమం చేస్తూ బంగారు పతకాన్ని ఒడిసి పట్టుకుంది.

2014 ఇంచియాన్‌‌‌‌ ఆసియా క్రీడల్లో కొరియా ఈ రికార్డును నమోదు చేసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇండియా త్రయం వరుసగా పర్ఫెక్ట్‌‌‌‌ 10లతో తొలి ఎండ్‌‌‌‌లో 60–58 స్కోరు సాధించింది. అదే జోరుతో రెండో ఎండ్‌‌‌‌ను కూడా 60–58తో సొంతం చేసుకుంది. ఫైనల్‌‌‌‌ ఎండ్‌‌‌‌లోకి ప్రవేశించే ముందు ఇండియా త్రయం178–176 స్కోరుతో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

రెండు 9లతో ఒత్తిడికి లోనైన చైనా.. తర్వాతి రౌండ్‌‌‌‌లోనూ తడబడింది. మొత్తానికి ఆరుసార్లు పర్ఫెక్ట్‌‌‌‌ 10 స్కోరు సాధించిన ఇండియా వరల్డ్‌‌‌‌ రికార్డు స్కోరుతో టైటిల్‌‌‌‌ను నిలబెట్టుకుంది. మెన్స్‌‌‌‌ ఫైనల్లో కుశాల్‌‌‌‌ దలాల్‌‌‌‌–-సాహిల్‌‌‌‌ జాదవ్‌‌‌‌–-గణేష్‌‌‌‌ మణిరత్నం తిరుమురులతో కూడిన ఇండియా 238–-237 తేడాతో చైనాకు చెందిన జియాహావో లియావో–-జిన్యి లియు–-జింగ్యు షిల త్రయంపై విజయం సాధించి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో బంగారు పతకాన్ని  కైవసం చేసుకుంది. 

©️ VIL Media Pvt Ltd.