డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చూడటానికి పైన ముళ్లతో కూడి ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో చాలా మంది దీనిని ఎలా కట్ చేయాలి అని సందేహపడుతుంటారు. అయితే మీరు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయాలి అంటే ముందుగా మంచి పండు ఎంచుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. పై తొక్క పింక్ కలర్లో ఉండి, కాస్త నొక్కితే మెత్తగా ఉండే కాయను ఎంచుకోవాలి. ఆకుపచ్చగా ఉన్నది తీసుకుంటే దానిని కట్ చేయడం కాస్త కష్టమే అవుతుందంట.
ఇక డ్రాగన్ ప్రూట్ కట్ చేయాలి అంటే. ముందుగా దీనిని కటింగ్ బోర్డ్ పై పెట్టి, కాడ భాగాన్ని, కింది భాగాన్ని కాస్త చిన్నగా కట్ చేయాలి. దీని వలన పండు సమానంగా నిల్చుంటుంది. కట్ చేయడం కూడా చాలా సులువు అవుతుంది.
దీని తర్వాత పండును నిలువుగా నిల్చో బెట్టి, పై నుంచి కిందకు రెండు సమాన భాగాలుగా కట్ చేయాలి. ఇలా కట్ చేయగానే రెండు భాగాలను వేరు చేయాలి. తెలుపు లేదా ఎరుపు రంగులో నల్లటి గింజలు ఉన్న గుజ్జు కనిపిస్తుంది. అప్పుడు రెండు భాగాల్లో ఒకదాన్ని తీసుకోవాలి.
పెద్ద స్పూన్‌తో తీసుకొని తొక్కకు, గుజ్జుకు మధ్యలో పెట్టి తిప్పుతూ కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని ఎలా అయితే వేరు చేస్తామో ఈ గుజ్జును డ్రాగన్ ఫ్రూట్ తొక్క నుంచి వేరు చేయాలి. ఇలా కొద్ది కొద్దిగా కాకుండా మొత్తం వేరు చేయాలి. ఇది వేరు చేసిన తర్వాత తొక్కను పారేయ్యాలి.
ఇలా రెండో భాగం నుంచి కూడా గుజ్జును తీయాలి. ఆ తర్వాత గుజ్జును ప్లేట్ లేదా ఆ తొక్కలే ఉండి చిన్ని చిన్న ఉండలు లేదా క్యూబ్స్‌లా కట్ చేసుకొని తినాలి. అంతే ఇలా కట్ చేయడం సరైన విధానం. ఇక డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరానికి చాలా మంచిది.




