
చర్మం మృదువుగా.. మెరిసేలా ఉండాలని అందరూ కోరుకుంటారు. మరి అలా ఉండాలంటే దానికి సరైన కేర్ తీసుకోవాలి. స్కిన్ కేర్ లో బాడీ లోషన్ చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈ లోషన్స్ స్కిన్ కి చాలా హెల్ప్ చేస్తాయి. వీటిని రెగ్యులర్ గా వాడడం వల్ల స్కిన్ స్మూత్ గా , సాఫ్ట్ గా మారుతుంది. ఇవే కాకుండా లోషన్స్ వల్ల ఎన్నోరకాల ఉపయోగాలుంటాయి. అయితే మార్కెట్లో రకరకాల బాడీ లోషన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటికన్నా ఇంట్లో తయారు చేసుకున్నవి మంచి ఫలితాలు అందించడంతో పాటు కెమికల్ ఫ్రీగా ఉంటాయి. మరి లోషన్ తయారీ.. వాటివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
స్కిన్ లోషన్ ను ఇంట్లో సింపుల్ ప్రాసెస్ తో తయారు చేసుకోవచ్చు. దీనికి కేవలం అర కప్పు బియ్యం, నీళ్లు, విటమిన్- ఇ. ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే చాలు.
లోషన్ని చర్మానికి రాస్తారు కాబట్టి బియ్యాన్ని రెండు, మూడుసార్లు బాగా కడగాలి. ఏమైనా దుమ్ము ఉంటే పోతుంది. ఆపైన నీళ్లు ఎక్కు వపోసి అన్నం మెత్తగా వండాలి. వేడిగా ఉన్నప్పుడే దాన్ని మెత్తగా రుబ్బి పేస్ట్ లా చేయాలి. ఆ మిశ్రమాన్నిఒక గిన్నెలోకి తీసుకుని, అందులో నాలుగు చుక్కల విటమిన్- ఇ. ఐదారు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. తయారైన ఈ లోషన్ ను ఒక కంటెయిన ర్ లో వేసి ప్రిజ్లో పెట్టాలి.
ఫ్రిజ్ లో పెడితే ఈ హోం మేడ్ బాడీ లోషన్ చాలారోజుల వరకు నిల్వ ఉంటుంది. కావాల్సినప్పుడు ఈ లోషన్ ను చర్మానికి రాసుకోవ చ్చు. మిశ్రమం గట్టిగా అనిపిస్తే, అందులో కొద్దిగా పెట్రోలియం జెల్లీ కలుపుకోవచ్చు.
లోషన్ తో లాభాలు ఇవే
- లోషన్లు చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఎలాంటి వెదర్ కండిషన్స్ అయినా కూడా స్కిన్ త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది. పొల్యూషన్ వల్ల, కెమికల్స్ వల్ల, స్విమ్మింగ్ పూల్స్ నీళ్లకు చర్మం త్వరగా డ్రై అవుతుంది. అందువల్ల చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ గా బాడీ లోషన్ అప్లై చేసుకోవాలి. అప్పుడే స్కిన్ అందంగా ఉంటుంది.
- డ్రైస్కిన్, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్ … ఏ స్కిన్ అయినా సరే, కొన్ని రఫ్ స్పాట్స్ తప్పకుండా ఉంటాయి. ఇవి సాఫ్ట్ గా అవ్వాలంటే తప్పకుండా బాడీ లోషన్ అప్లై చేయాలి.
- పొడి చర్మం వల్ల దురద ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే బాడీ లోషన్ తప్పనిసరి.
- ఎక్కువ సేపు నిల్చోవడం వల్ల పాదాల దగ్గర చర్మం గట్టిగా తయారవుతుంది. ఇది ఒక్కోసారి నొప్పిగా కూడా ఉంటుంది. అందువల్ల లోషన్ ను రెగ్యులర్ రాస్తుంటే స్కిన్ సాఫ్ట్ అవుతుంది.
- రెగ్యులర్ గా బాడీ లోషన్ వాడడంవల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, చర్మం నిగారిస్తుంది.
- బాడీ లోషన్ రెగ్యులర్గా రాసుకోవడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.
- స్నానం చేసిన తర్వాత, నిద్ర పోవడానికి ముందు బాడీ లోషన్ అప్లై చేయడంవల్ల, న్యూట్రియెంట్ర్సును స్కిన్ సులువుగా అబ్జార్బ్ చేసుకుంటుంది.
- ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, సన్ ఎఫెక్ట్ నుంచి స్కిన్ ను ప్రొటెక్ట్ చేస్తాయి లోషన్స్. అలాగే సన్ స్క్రీన్ లోషన్స్ కూడా చర్మానికి మేలు చేస్తాయి.