Reading Time: 2 minutes

జ్యోతిష్యం: అక్టోబర్ నెల వృషభ రాశి.. ఆగిపోయున పనులు వేగవంతం.. ఈ రాశి వారి పంట పండినట్టే..!

Caption of Image.

అక్టోబర్​ 10 వ తేదీ వరకు మహాలయపక్షాలు ఉంటాయి.  వివిధ గ్రహాలు  వాటి స్థానాల్లో కీలక మార్పులు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గ్రహాల సంచారంలో జరిగిన మార్పుల వలన ఈ రాశి వారికి 2026 అక్టోబర్​ నెలలో  ఆర్థిక స్థిరత్వం, నిలిచిపోయిన పనులకు ఊపందుకుంటాయి.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  ఈ ఏడాది ( 2026)చివరి మూడు నెలలు ( అక్టోబర్​. నవంబర్​, డిసెంబర్​) ఆర్థిక పరమైన ఊరటను ఇస్తాయి.ఈ నెల (2026 అక్టోబర్​ వృషభరాశి వారికి ఎలా ఉంటుందో ఈస్టోరీలో తెలుసుకుందాం. . .

అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి.  ఈ నెలలో ( 2026 అక్టోబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

అక్టోబర్​లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు

  • అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
  •  అక్టోబర్ 17:   తులారాశిలోకి  సూర్యుడు 
  • అక్టోబర్ 24: తులారాశిలో   బుధుడు వక్రగతి సంచారం
  • అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు 

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నెలలో ( 2026 అక్టోబర్)​ శుక్రుడు.. సూర్యుడు..బుధుడు గ్రహాల సంచారంలో జరిగే మార్పుల వలన లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య యోగం, బుధాదిత్యయోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

వృషభరాశి వారికి ఈ నెలలో ( 2026 అక్టోబర్​) లో  ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు బాధ్యతలు పెరిగినా కాని.. సమర్దవంతంగా నిర్వహించడం వలన పై అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి.  కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ నెలలో తమ దీర్ఘకాలిక కృషికి ఊహించని ఫలితాలను పొందుతారు., ఆర్థిక విషయాలు  అనుకూలంగా ఉంటాయి

ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ నెలలో ఊహించని లాభాలు అందుకుంటారు. సంపాదన పెరిగినప్పటికీ, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  స్నేహితుల నుంచి సపోర్ట్‌ అందుకుంటారు. పండుగలను సంతోషంగా జరుపుకొంటారు. భూ, ఆస్తి విషయాల్లో మీకు ఆశించిన లాభాలు వచ్చే అవకాశం ఉంది.
 
సూర్యుడు వృషభరాశికి చెందిన జాతక చక్రంలో  5వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఆహారపు అలవాట్లు మారతాయి. 3వ ఇంట్లో  సంచరించే  కుజుడు ఉత్సాహంతో పాటు ఆందోళన కూడా కలుగజేస్తాడు. తొందరపడి పనులు చేయడం వలన కాళ్లకు.. చేతులకు గాయాలయ్యే అవకాశం ఉంది.  మెట్లు దిగేటప్పుడు.. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  నిద్రలేమి, అధిక ఒత్తిడి , కడుపు సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఆహార నియమాలు పాటించడం చాలా అవసరమని పండితులు చెబుతున్నారు.  శుక్రుడి వక్రగమనం వలన డయాబెటిక్​ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి.  గురుడు సంచారంలో మార్పు వలన  తోబుట్టువులతో సంబంధాలను బలపరుస్తుంది.  సహోద్యోగులతో అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మొత్తం మీద ఒక కొత్త ప్రారంభానికి నాంది పలకడానికి ఇది ఒక ముఖ్యమైన నెల అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ALSO READ :  జ్యోతిష్యం : అక్టోబర్ నెలలో మేష రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది..

చేయాల్సిన పరిహారాలు

  • మంగళవారం  హనుమాన్ చాలీసా పఠించడం
  • రోజూ 108 సార్లు “ఓం శుక్రాయ నమః” అనే మంత్రాన్ని ప్రదోష కాలంలో కాని.. బ్రహ్మ ముహూర్తంలోకాని పఠించడం
  • మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం 
  • ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పాదాల దగ్గర  తెల్లని పువ్వులను సమర్పించడం.. 
  • ఆవులకు పచ్చిమేత ఆహారంగా ఇవ్వడం
  • పేదలకు పాలు.. బియ్యం దానం 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.