Reading Time: < 1 minute

జూబ్లీహిల్స్‌‌లో MS ధోని సందడి

Caption of Image.
  • సతీమణి సాక్షితో కలిసి పెడల్ క్లబ్ ఓపెనింగ్‌‌కు హాజరు 

జూబ్లీహిల్స్/గండిపేట, వెలుగు: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తన సతీమణి సాక్షితో కలిసి గురువారం హైదరాబాద్‌‌లో సందడి చేశారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ధోని దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. 

అనంతరం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 34లో నూతనంగా ఏర్పాటు చేసిన పెడల్ క్లబ్ ను ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ధోని రాక విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని, ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. దీంతో పెడల్ క్లబ్ పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది.  

©️ VIL Media Pvt Ltd.