
ముషీరాబాద్, వెలుగు: గాంధీ జయంతిని పురస్కరించుకొని బాగ్ లింగంపల్లి లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో కళాశాల ఎన్ సీసీ ఆధ్వర్యంలో గురువారం సామూహిక స్వచ్ఛత అభియాన్ నిర్వహించారు. కాలేజీ నుంచి ప్రధాన రోడ్డు మీదుగా బస్టాప్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు.
స్వచ్ఛత.. సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, మేనేజ్మెంట్, ఎన్ సీసీ ఎగ్జిక్యూటివ్ఆఫీసర్, కేడెట్స్ పాల్గొన్నారు.