Reading Time: < 1 minute

ఫామ్ 6 లో మార్పులు చేయమని టాటా కన్సల్టెన్సీపై ఒత్తిడి! : రాహుల్ గాంధీ

Caption of Image.

ఫామ్ 6 లో మార్పులపై కీలక ప్రశ్నలు సంధించారు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఓటర్ రిజిస్ట్రేషన్ లో కీలకమైన ఫామ్ 6లో మార్పులు చేయమని ఎవరు  ఆదేశించారని ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించారు. ఈ మార్పులను అమలు చేయమని టాటా కన్సల్టెన్సీని (TCS) ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. 

ఫామ్ 6లో మార్పులపై 2026 అక్టోబర్ 01వ తేదీన ఎక్స్ లో ట్వీట్ చేశారు రాహుల్. ఆన్ లైన్ ఫామ్ 6 చట్ట విరుద్ధంగా మార్చారు.. ఎన్నికల సంఘంలో ఉన్న కమిషనర్లే ఈ నిర్ణయం తీసుకున్నారా..? మార్పులు చేయాల్సిందిగా టాటా కన్సల్టెన్సీని ఒత్తిడి చేసిందెవరు. దీనిపై సంతకాలు చేసింది ఎవరు..? అని ప్రశ్నించారు. 

విపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడితో ఈ డిక్లరేషన్ ను ECINET యాప్, పోర్టల్ నుంచి, అలాగే   ప్రధాన ఎన్నికల అధికారి పోర్టల్‌ల నుండి తొలగించారు. దీని అర్థం, ఈ రాష్ట్రాల్లో కొత్త ఓటర్లు కేవలం  ఓటరు నమోదు కోసం సాధారణ చట్టబద్ధమైన ఫారం 6ను మాత్రమే సమర్పిస్తే సరిపోదతుందని చెబుతున్నారు.

SIR ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో, అదనపు డిక్లరేషన్ ECINET పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ డిక్లరేషన్ ప్రకారం, కొత్త ఓటర్లు  తమ తల్లిదండ్రులను లేదా తాతామామ్మలను, గతంలో జరిగిన SIR సమయంలో తయారుచేసిన ఓటర్ల జాబితాల అటాచ్ చేస్తూ వివరాలను అందించాల్సి ఉంటుంది. 

©️ VIL Media Pvt Ltd.