
లక్నో వేదికగా 50 దేశాల పోటీదారులతో జరిగిన మిసెస్ వరల్డ్ కప్ పోటీల్లో విజేతగా నిలిచిన ఆశా దీపిక తొలిసారిగా భారత్ కు చేరుకున్నారు. గురువారం ( అక్టోబర్ 1 ) శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఆశా దీపికను సత్కరించారు.
ఈ సందర్భంగా ఆశా దీపిక మాట్లాడుతూ… తెలంగాణలో పెరిగిన తాను ప్రస్తుతం అమెరికాలో ఏఐ టెక్నాలజీలో పనిచేస్తున్నట్లు తెలిపారు.
50 దేశాల పోటీదారులతో జరిగిన పోటీలో భారత్ కు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించడం గర్వంగా ఉందని అన్నారు ఆశా దీపిక. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే తన భవిష్యత్ లక్ష్యమని తెలిపారు ఆశా దీపిక. ఆశా దీపిక ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కుటుంబసభ్యులు, సన్నిహితులు.