Reading Time: < 1 minute

ఇ.వి.వి ‘ఆరుగురు పతివ్రతలు’ రీ–రిలీజ్.. 20 ఏళ్ల తర్వాత థియేటర్లలో బోల్డ్ & కల్ట్ క్లాసిక్ హంగామా!

Caption of Image.

 దివంగత లెజెండరీ డైరెక్టర్ ఇ.వి.వి. సత్యనారాయణ మార్క్ సినిమాలకు టాలీవుడ్‌లో ఉండే క్రేజే వేరు. కామెడీతో పాటు బోల్డ్ ,  సోషల్ కాన్సెప్ట్‌లను టచ్ చేయడంలో ఆయన రూటే సపరేట్. సరిగ్గా 22 ఏళ్ల క్రితం (2004 ఫిబ్రవరి 6న) సమాజంలో ఎవరూ ఓపెన్‌గా మాట్లాడటానికి కూడా భయపడే వివాహ వ్యవస్థలోని లోపాలు, దాంపత్య సమస్యలు, శాడిస్ట్ భర్తలు, వైవాహిక జీవితంలోని ఈగోలపై ఆయన తీసిన సంచలన చిత్రం ‘ఆరుగురు పతివ్రతలు’ (Aaruguru Pativratalu). అప్పట్లో ట్రెండ్‌కు మించిన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్, ఇప్పుడు సరికొత్త 4K అల్ట్రా HD సాంకేతిక హంగులతో అక్టోబర్ 29న మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.

కథేంటంటే..?

పదో తరగతిలో కలిసి చదువుకున్న ఆరుగురు స్నేహితురాళ్లు చాలా ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకుంటారు. ఈ క్రమంలో తమ వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక, శారీరక ఇబ్బందులు, భర్తల శాడిజం, సీక్రెట్ అఫైర్లు, బలవంతపు పెళ్లిళ్ల వెనుక ఉన్న చేదు నిజాలను ఒకరికొకరు పంచుకుంటారు. చివరికి ఓ శాడిస్ట్ భర్త బారి నుంచి తమ స్నేహితురాలిని కాపాడుకోవడానికి ఆ ఆరుగురు మహిళలు ఏం చేశారు? అనేదే ఈ చిత్రం

ట్రెండ్ సెట్టర్ రీ-ఎంట్రీ..

అప్పట్లో ఈ సినిమా ద్వారా  ఇ.వి.వి.  సత్యనారాయణ ఏకంగా 42 మంది నూతన నటీనటులను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఎల్.బి. శ్రీరామ్, చలపతిరావు, అమృత, లహరి, శ్రీకృష్ణ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలైన సమయంలో కొందరిని ఆశ్చర్యపరిచినా.. ఆ తర్వాత సోషల్ మీడియా, మీమ్స్ ప్రపంచంలో ఈ మూవీ విపరీతమైన కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

నేటి టాలీవుడ్ రీ-రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా వస్తున్న ఈ బోల్డ్ అండ్ రియలిస్టిక్ డ్రామా, ప్రస్తుత యూత్‌ను , ఈ తరం ప్రేక్షకులను ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. పక్కా  ఇ.వి.వి  సత్యనారాయణ  మార్క్ ఎంటర్‌టైన్‌‌మెంట్‌తో రాబోతున్న ఈ 4K రీ-రిలీజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హడావుడి చేస్తుందో చూడాలి..

 

©️ VIL Media Pvt Ltd.