Reading Time: < 1 minute

హైదరాబాద్ గచ్చిబౌలిలో.. ఢిల్లీ వ్యక్తి.. విదేశీ యువతులతో వ్యభిచారం రాకెట్

Caption of Image.

గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 2026 అక్టోబర్ ఒకటవ తేదీన వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా, విటులు, విదేశీ మహిళలను పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో జరిపిన ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 గచ్చిబౌలి డ్రీమ్ ప్రైడ్ హోటల్‌ కేంద్రంగా విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో హోటల్‌ పై గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు దాడి చేశారు.

నిర్వాహకుడు నిఖిల్, రామ్మోహన్ రెడ్డి , విటుడు హర్షిత్ సింఘానియా, వ్యభిచారానికి పాల్పడుతున్న ముగ్గురు విదేశీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటన స్థలం నుంచి 23 వాడిన కాండమ్స్, 13వేల నగదు, మారం మోహన్ రెడ్డి నుంచి  రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిర్వాహకుడు నిఖిల్ ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మహిళలను గచ్చిబౌలిలోని డ్రీమ్ ప్రైడ్ హోటల్లో వేరే వేరే గదుల్లో ఉంచి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళల్ని ముగ్గురిని ఉజ్బెకిస్తాన్‌ దేశానికి చెందిన మహిళలుగా గుర్తించారు.

దొరికిన విదేశీ మహిళల వద్ద పాస్ పోర్టులు, వీసాలు, చెల్లుబాటులో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఉజ్బెకిస్తాన్‌ దేశం నుంచి కొద్ది రోజుల క్రితమే హైదరాబాదుకు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.