Reading Time: < 1 minute

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… క్రషర్ లారీ ఢీకొని పల్టీలు కొట్టిన ఆటో.. మహిళ స్పాట్ డెడ్..

Caption of Image.

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపాలెం మండలం కోయచెలక క్రాస్ రోడ్ దగ్గర క్రషర్ లారీని ఢీకొని ఆటో పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ( అక్టోబర్ 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కూలీలతో వెళ్తున్న ఆటో క్రషర్ లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన మహిళ సహా ఆటోలో ప్రయాణిస్తున్నవారు ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు.

రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో కూలికి వెళ్ళి వస్తుండగా ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

©️ VIL Media Pvt Ltd.