Reading Time: < 1 minute
India Bloc Plans October 6 March To Election Commission Five Rallies Over Vote Chori

INDIA Bloc: ఎన్నికల సంఘంపై విమర్శలు, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ నేపథ్యంలో ఈ రోజు(బుధవారం) ఇండీ కూటమి కీలక సమావేశాన్ని నిర్వహించింది. అక్టోబర్ 06న అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కలిసి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ నిర్వహించున్నట్లు ప్రకటించింది. ఎస్ఐఆర్ వివారం, ఓటర్ల జాబితాలో మార్పులు, ఎన్నికల సంఘం నిర్ణయ ప్రక్రియపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఢిల్లీలో మార్చ్‌తో పాటు అక్టోబర్, నవంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా 5 భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఓటర్ల హక్కులకు కలుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే ఈ ర్యాలీలు ముఖ్య లక్ష్యమని ఆయన అన్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పార్లమెంట్ నుంచి వీధి పోరాటాలు, నిరసనలు, దేశవ్యాప్త ర్యాలీలు, సుప్రీంకోర్టు వరకు తమ కార్యాచరణ ఉంటుందని ఇండీ కూటమి ప్రకటించింది.

ఇండీ కూటమి నవంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి, ‘‘ఓట్ చోరీ’’పై తమ ఆరోపణల్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామని ఖర్గే చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థల పనితీరుపై తమ అభ్యంతరాలను వివరించేందుకు అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రపతిలో సమావేశం కోరినట్లు ఖర్గే వెల్లడించారు. ఎన్నికల సంఘం సహా ఇతర రాజ్యాంగ సంస్థలు తమ స్వతంత్రతను కోల్పోతున్నాయని రాష్ట్రపతికి వివరించనున్నట్లు తెలిపారు.

SIR, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పెండింగ్ కేసుల్ని త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఇండీ కూటమి నిర్ణయించినట్లు ఖర్గే చెప్పారు. రాహుల్ గాంధీ గత రెండేళ్లుగా ఎన్నికల్లో ‘‘ఓట్ చోరీ’’ గురించి ఆరోపిస్తున్న విషయాన్ని ఖర్గే పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పలు సందర్భాల్లో ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఆయన అన్నారు.