Reading Time: < 1 minute

ChatGPTలో వర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్‌.. మీ స్మార్ట్ ఫోనే ట్రైల్ రూం..!

Caption of Image.

OpenAI  డెవలప్ చేసిన ChatGPTలో వర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్‌ వచ్చేసింది. దుస్తులు లేదా యాక్సెసరీలను కొనుగోలు చేసే ముందు.. వాటిని ట్రైల్ రూంలో ధరించి.. బాగున్నాయో లేదో మనకు సూట్ అవుతున్నాయో.. లేదో చూసుకుని కొనుక్కుంటాం. కానీ.. ఆన్ లైన్లో ఆ ఆప్షన్ ఉండదు. మనకు నచ్చిన దుస్తులను ఆర్డర్ చేసి ఇంటికొచ్చాక వాటిని ట్రై చేసి.. నచ్చకపోతే మళ్లీ రిటర్న్ పెడుతుంటారు.

కానీ.. ఇకపై ఈ తిప్పలు లేకుండా  ChatGPTలో వర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్‌ తీసుకొచ్చింది. మీరు ఆర్డర్ చేసే క్లాత్స్ గానీ, ఫ్యాషన్ యాక్సెసరీస్ గానీ.. ప్రివ్యూలో చూసుకోవచ్చు. ChatGPT షాపింగ్ రిజల్ట్స్లో దుస్తుల పక్కన కొత్తగా ‘ట్రై ఆన్’ బటన్ కనిపిస్తుంది.

వినియోగదారులు దానిపై ట్యాప్ చేసి, ఒక సెల్ఫీ లేదా మీ ఫుల్ ఫొటోను అప్‌లోడ్ చేస్తే, మీరు ఆ వస్తువును లేదా దుస్తులను ధరించిన చిత్రాన్ని ChatGPT రూపొందిస్తుంది. గూగుల్ 2025లో సెర్చ్‌లో ఇలాంటి ట్రై-ఆన్ ఫీచర్‌ను జోడించింది. ఇప్పుడు ChatGPT ఫ్యాషన్ డిస్కవరీ కోసం గూగుల్ షాపింగ్, పింట్రెస్ట్‌లతో పోటీ పడుతోంది.

©️ VIL Media Pvt Ltd.