Reading Time: < 1 minute

TWU ను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలి : PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు:  ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూయూను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన జూమ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ టీడబ్ల్యూయూ అధ్యక్షుడు రాజిరెడ్డి బాణం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

అన్ని డిపోల ​అధ్యక్ష, కార్యదర్శులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పీసీసీ చీఫ్ సూచించారు. బాణం గుర్తు మీద ఓటువేసి గెలిపించేలా కార్మికులను కోరాలని ఆదేశించారు. అనంతరం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ విలీనం ఆలస్యం అయినా ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని, 2017 పీఆర్సీ, పెండింగ్ డీఏలు చెల్లించామని తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.