
జ్యోతిష్యం ప్రకారం 2026 అక్టోబర్ నెల వృశ్చిక రాశి వారికి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో భారీగా గ్రహాలు మారనునన్నాయి. దీని ప్రభావం వలన ఈ నెల ( అక్టోబర్2026) వృశ్చిక రాశివారికి ఎలా ఉంటుంది.. ఆర్థిక స్థితిగతులపై గ్రహాల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది..సుఖ సంతోషాలు ఎలాఉంటాయి.మొదలగు విషయాలనుఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
గ్రహాల సంచారం ఆధారంగా వృశ్చిక రాశి వారికి 2026 సెప్టెంబరు నెల చాలా అనుకూలంగా, లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగావకాశాలు వెతుకుతున్న వారికి మంచి ఆఫర్లు వస్తాయి.
అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ నెలలో ( 2026 అక్టోబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
అక్టోబర్లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు
- అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 17: తులారాశిలోకి సూర్యుడు
- అక్టోబర్ 24: తులారాశిలో బుధుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నెలలో ( 2026 అక్టోబర్) శుక్రుడు.. సూర్యుడు..బుధుడు గ్రహాల సంచారంలో జరిగే మార్పుల వలన లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య యోగం, బుధాదిత్యయోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. 9వ ఇంట్లో కుజుడి సంచారం వలన పని భారం పెరిగే అవకాశం ఉంది. 12వ ఇంట్లో సూర్యుని సంచారం వలన ఐదవ ఇంట్లో వక్రించిన శని కారణంగాపూర్తికాని వ్యక్తిగత ప్రాజెక్ట్ గురించిన చింతలతో మీ మనస్సు చిక్కుల్లో పడవచ్చు. నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోండి. 12 వ ఇంట్లో వక్రగతిలో శుక్ర సంచారం వలన .., బుధ గ్రహ తిరోగమనం పాత విషయాలపై దృష్టి పెడతారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. 4వ ఇంట్లో రాహువు ఉండటం ఆందోళన పెరుగుతుంది.
వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు అనేక కొత్త మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కళారంగంలో ఉన్నవారికి పురోగతి మార్గం కనిపిస్తుంది. మీ వృత్తిలో ఒక కొత్త మార్పును మీరు చూడవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందుతుంది.
వ్యాపారవేత్తలకు లాభాలు మెండుగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. మొండిబాకీలు వసూలవుతాయి. నూతన ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. ఆస్తి కొనుగోలు ఆలోచనలు కలసివస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. సంతానానికి సంబంధించి నూతన విజయాలు చూస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పాత అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. మనశ్శాంతి లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ALSO READ : అక్టోబర్ నెలలో కీలగ గ్రహాలు మార్పు.. తులా రాశి వారికి కొత్త ఆశలు చిగురింపు..
చేయాల్సిన పరిహారాలు
- మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం
- ఉదయం మరియు సాయంత్రం “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
- ప్రతి మంగళవారం హనుమంతుడికి ఎర్ర గులాబీలు లేదా మందార పువ్వులను సమర్పించండి.
- ప్రతి ఆదివారం ఒక పేదవానికి బెల్లం, గోధుమలు దానం
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.