
హైదరాబాద్, వెలుగు: వేసవిలో ప్రత్యేక సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించామని సదరన్ డిస్కమ్స్ సీఎండీ జితేశ్ వి పాటిల్ తెలిపారు. సబ్‌స్టేషన్లు, ఫీడర్ల సామర్థ్య పెంపు, ఫీడర్ విభజన, కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏటా సగటున 6 నుంచి 7 శాతం మేర పెరుగుతోందన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో ఎలాంటి ఆలస్యం చేయడం లేదని, అవసరమైన పత్రాలు పూర్తికాని కొన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.