Reading Time: 3 minutes
అక్టోబర్ 1 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!

దిన ఫలాలు (అక్టోబర్ 1, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి.
వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెడతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహా రాల్ని పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం మంచిది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగంలో బాధ్యతల ఒత్తిడి ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. స్నేహితుల సహాయ సహాకారాలకు లోటుండదు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సజావుగా పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిరు ద్యోగులకు కాలం కలిసి వస్తుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొం టారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. కొత్త అవకాశాలు అంది వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ప్రముఖులతో పరిచ యాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ధనపరంగా వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితంగా తక్కువగా ఉంటుంది. ఉచిత సహాయాలకు, దానధర్మాలకు ఇది సమయం కాదు. ఆర్థిక వ్యవ హారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృథా ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. బంధువుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయ లుగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కార్యసిద్ధికి అవకాశం ఉంది. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరు ద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఒక విందులో ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభా లకు లోటుండదు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగపరంగా విదేశాల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగాఅనుకూలంగా ఉంది. వీలైనంత సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు మిత్రుల కారణంగా విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు విస్తరిస్తాయి. నిరుద్యోగు లకు ఊహించని ఆఫర్ అందుతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట తొందరపాటు మంచిది కాదు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఇంటా బయటా బాగాఒత్తిడి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారు. మీ వల్ల బంధుమిత్రులు లాభం పొందుతారు. ప్రతి పనీ లాభ సాటిగా పూర్తవుతుంది. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెంచడం మంచిది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు సమస్యలను పరిష్కరించుకుంటారు. పని ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

Also Read: 12 రాశుల వారికి అక్టోబర్ 2026 మాసఫలాలు..

గమనిక: ఈ కథనంలోని జ్యోతిష్య ఫలితాలు సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య అంచనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన వాస్తవాలుగా పరిగణించకూడదు.