Reading Time: 2 minutes

మట్టిలో మాణిక్యాలు ఈ చిన్నారులు.. వీళ్ల పాటకి నెటిజన్స్ ఫిదా.. బాలీవుడ్ సాంగ్తో వైరల్..!

Caption of Image.

పువ్వు  పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా.. అలాంటి మట్టిలో మాణిక్యాలు ఈ చిన్నారులు. గురువు లేకుండానే కోయిల గానం నేర్చుకున్నట్లుగా.. వీళ్లు ఎవరి దగ్గర శిశ్యరికం చేయకుండానే.. అక్షరాలను వళ్లించే వయసులో తమ గాత్రంతో దేశం అంతా వైరల్ గా మారారు. వీళ్ల గానామృతానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన గాన కోకిలల గురించి తెలుసుకుందాం. 

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన సింకా, ఎంగంజన్,  లిలీ అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు.. లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లుగా.. పాప్ సింగర్స్ పాడినట్లుగా అద్భుతమైన గొంతుతో, ఎక్స్ ప్రెషన్స్ తో పాడిన పాట వైరల్ గా మారింది. 

వీళ్లు పాడిన ఒక పాట దాదాపు 16 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ అవుతోంది. పతీ పత్నీ ఔర్ వో సినిమాలోని ఏక్ తు హి యార్ మేరా పాటకకు అద్భుతమైన రీచ్ వచ్చింది. కెమెరా ముందు ఎంతో కాన్ఫిడెన్స్ తో ఈ చిన్నారులు పాడిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

పాట ప్లే అవుతుండగా, ఆ అక్కాచెల్లెళ్లు సంగీతానికి అనుగుణంగా ఊగుతూ, చిన్న చిన్న డాన్స్ మూవ్స్ తో, పాడుతూనే అప్పుడప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ స్టేజ్ పర్ఫామెన్స్ ను తలపించేలా వాళ్ల టాలెంట్ చూపించారు. వారి సహజమైన హావభావాలు, వారి మధ్య ఉన్న  అనుబంధం , వాళ్ల వెనుక ఉన్న బ్యాగ్రౌండ్ లొకేషన్స్..  వాళ్ల ప్రదర్శనను మరింత ఆకట్టుకునేలా చేశాయి. త్రీ సిస్టర్స్ ఆర్ బ్యాక్.. అనే పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియో. 

సింగిల్ ఫ్రేమ్ లో టూ మచ్ క్యూట్ నెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రూ ఏంజిల్స్ అంటూ మెచ్చుకుంటున్నారు. మీరు చూసి వాళ్ల ట్యాలెంట్ నచ్చితే కామెంట్ చేసేయండి. 

©️ VIL Media Pvt Ltd.