Reading Time: < 1 minute
Crazy Rumors Surrounding Anil Ravipudi

అనిల్ రావిపూడి ఓ వైపు సినిమాలు, మరో వైపు టీవీ షోస్, ఇవి చాలవన్నట్లు మూవీ ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేస్తూ అందర్ని షాక్‌కు గురి చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ నెక్ట్స్ సినిమాను డిలే చేయడం లేదు. టార్గెట్ పెట్టుకున్న సంక్రాంతికి వచ్చే విధంగానే షూట్ చేస్తున్నాడు. వెంకటేష్- కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీ జనవరి 12 విడుదల ఆల్మోస్ట్ 80-90 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయ్యిందట. టైటిల్లోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్ మిస్ కానివ్వడు అనిల్.

జనవరి 12 తర్వాత అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజక్ట్ ఎవరితో చర్చ నడుస్తోంది. ఎంతో మంది హీరోల పేర్లు బయటకొచ్చాయి. తాజాగా మహేష్ బాబు నేమ్ తెరపైకి వస్తే.. అనిలే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. సో ఈ రూమర్ అంతటితో క్లోజ్ అయ్యింది. కానీ డైరెక్టర్ చుట్టూ కొత్త గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సీనియర్ స్టార్ హీరోల్లో నాగ్‌ని తప్ప అందర్ని చుట్టేసిన అనిల్ రావిపూడి.. నెక్ట్స్ అతడ్ని కూడా కవర్ చేయబోతున్నాడని టాక్. కాకపోతే చిరంజీవిని కూడా మిక్స్ చేసి మరో మల్టీస్టారర్ సిద్ధం చేస్తున్నాడని ఓ ఇంట్రస్టింగ్ రూమర్ సర్య్కులేట్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున కొలబరేషన్ గాసిప్ కంటే మరో న్యూస్ క్యూరియాసిటి కలిగిస్తోంది. ఇప్పటి వరకు యాక్షన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నుండి బయటకు రాని అనిల్.. ఈ సారి ఏకంగా యానిమేషన్ మూవీని రెడీ చేస్తున్నాడట. రామాయణను మైథాలజీ యానిమేషన్ మూవీగా తీసుకురావాలని స్కెచ్ వేశాడని బజ్. కెవిఎన్ ఈ సినిమాను నిర్మించనుందన్న రూమర్ చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబుతో సినిమా అంటే రిప్లై ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఈ గాసిప్స్‌పై కూడా స్పందిస్తాడేమో చూడాలి.