Reading Time: < 1 minute

సీనియర్ సిటిజన్స్కు ఉచిత బస్ పాసులు: మంత్రి పొన్నం ప్రభాకర్

Caption of Image.

సీనియర్ సిటిజన్స్ కు ఉచిత బస్ పాసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2026 అక్టోబర్ 01న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన  ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవంలో మంత్రులు  అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన  మంత్రి పొన్నం.. వీలైనంత త్వరగా ఉచిత బస్ పాసులు అందుబాటులోకి తెస్తామన్నారు. 

రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ.. ప్రజా పాలనలో భాగంగా సంక్షేమానికి వెనకాడటం లేదన్నారు. కుటుంబాల్లో వృద్ధులను గౌరవంగా చూసుకోవాలని ఈ సందర్భంగా  పిలుపునిచ్చారు. మీరు వయోవృద్దులు కాదు.. నవ సమాజ నిర్మాణానికి మార్గదర్శకులు అని కొనియాడారు. 

వయోవృద్ధుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో  వృద్ధుల సమస్యలు, హక్కులపై చర్చించారు. వయోవృద్ధులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.  వృద్ధుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతపై ఈ కార్యక్రమం నిర్వహించారు. వయోవృద్ధుల సేవలకు కృషి చేసిన వారికి సన్మానం చేశారు.  

©️ VIL Media Pvt Ltd.