టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన ఆమె.. తన అందం, అభినయంతో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికీ సమయం కేటాయిస్తున్న కాజల్.. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ సందర్భంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను గ్లామర్ పరంగా చూపించే విధానంపై కాజల్ స్పందించారు. ముఖ్యంగా కథతో సంబంధం లేకుండా హీరోయిన్ల నడుమును చూపించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారనే అభిప్రాయంపై ఆమెను ప్రశ్నించగా.. గతంలో ఇలాంటి అపోహలు ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నాయని కాజల్ పేర్కొంది. ప్రేక్షకుల అభిరుచులతో పాటు ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చాయని కాజల్ అంది.
ప్రస్తుతం సినిమాల్లో మహిళా పాత్రలకు, కథలో వారి ప్రాధాన్యానికి కూడా ఎక్కువ స్థానం లభిస్తోందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో కాజల్‌కు ఎదురైన మరో ఆసక్తికరమైన ప్రశ్న ఆమె ఫేవరెట్ హీరో గురించి. మీకు ఇష్టమైన హీరో ఎవరు.? అని అడగ్గా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పేరు చెప్పింది ఈ అందాల తార. చిన్నప్పటి నుంచే సల్మాన్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనే తన క్రష్ అని కాజల్ చెప్పుకొచ్చింది.
అంతేకాదు.. తన సోదరి నిషా అగర్వాల్ మాత్రం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అభిమాని అని కాజల్ తెలిపింది. ఇంట్లో తనకు, తనచెల్లికి హీరోల విషయంలో ఇష్టాలు వేరుగా ఉండేవని ఆమె సరదాగా తెలిపింది. అయితే సల్మాన్ ఖాన్ విషయంలో మాత్రం తన అభిమానం చాలా ప్రత్యేకమని కాజల్ చెప్పుకొచ్చింది. సల్మాన్ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే తాను అస్సలు ఊరుకోనని కూడా ఆమె సరదాగా పేర్కొంది. దీంతో కాజల్‌కు సల్మాన్‌పై ఉన్న అభిమానాన్ని చూసి ఫ్యాన్స్ ఆసక్తిగా స్పందిస్తున్నారు.
కాజల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుసగా సినిమాలు చేస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. మరో వైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను పంచుకుంటుంది. తన గ్లామరస్ ఫోటోలతో తన సినిమాలు, అలాగే ఫ్యామిలీ విశేషాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది కాజల్ అగర్వాల్.




