
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ హైదర్ గూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. హైదర్ గూడలోని గవర్నమెంట్ స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే.. శుక్రవారం ( అక్టోబర్ 2 ) గాంధీ జయంతి సందర్భంగా సెలవు రోజు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి…
హైదర్ గూడ లోని ఎర్రబోడ వీకర్ సెక్షన్ కాలనీలో గవర్నమెంట్ స్కూల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్కూల్లో నుంచి దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనలో స్కూల్లోని కొన్ని పుస్తకాలూ దగ్దమైనట్లు తెలుస్తోంది. సెలవు రోజు కావడంతో విద్యార్థులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు అధికారులు.