
కుంభ రాశి వారికి 2026 అక్టోబరు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి ఏలిన్నాటి శని జరుగుతున్నప్పటికీ, భాగ్య స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఈ నెలంతా చాలా వరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరంగా కొన్ని సానుకూలతలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రయత్నమైనా అనుకూల ఫలితాలనిస్తుంది.
అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ నెలలో ( 2026 అక్టోబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలలో ( 2026 అక్టోబర్) శుక్రుడు.. సూర్యుడు..బుధుడు గ్రహాల సంచారంలో జరిగే మార్పుల వలన లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య యోగం, బుధాదిత్యయోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
అక్టోబర్లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు
- అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 17: తులారాశిలోకి సూర్యుడు
- అక్టోబర్ 24: తులారాశిలో బుధుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు
ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు, సూచనలు లబ్ధి చేకూరుస్తాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. షష్ఠ స్థానంలో ఉన్న గురు, కుజుల వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. అయితే సహోద్యోగులు లేదా అధికారులతో మాట్లాడేటప్పుడు ఓర్పు వహించడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. వృథా ఖర్చులు, అనవసర పరిచయాలు పెరుగుతాయి.
నెల ద్వితీయార్థంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సేవారంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులకు ఇది సగటు సమయం.
పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకపోవడం మంచిది. పాత బకాయిలు కొద్దిగా వసూలవుతాయి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా సమయానుకూలంగా సమసిపోతాయి. భాగస్వామితో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్య పరంగా నరాల బలహీనత, నిద్రలేమి లేదా కాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. సరైన విశ్రాంతి, వ్యాయామం అవసరం.
ఆరవ ఇంట్లో గురు గ్రహం ఉచ్చ స్థితిలో ఉండటం రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది. కుజుడు బలాన్ని అందిస్తాడు. రాహువు ఉండటం కూడా ఆందోళనను పెంచుతుంది. రెండవ ఇంట్లో
శని వక్రీకరించడం వలన ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏడవ ఇంట్లో కేతువు ఉండటం దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది.
చేయాల్సిన పరిహారాలు
- రోజూ హనుమాన్ చాలీసా పఠించడం
- రాహుదేవుడిని శాంతింపజేయడానికి రోజూ “ఓం రహ్వే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి.
- సూర్య నమస్కారాలు చేయండి.
- పేదలకు అన్నదానం చేయండి.
- శనివారం శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం
- ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.