
ఓల్డ్సిటీ, వెలుగు: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు బాలురను సీసీఎల్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్, డీఐ మహమ్మద్మక్సూద్ అలీ, డీఎస్ఐ వేణుగోపాల్మంగళవారం తెలిపారు.
వరుస దొంగతనాలపై ఫిర్యాదులు రావడంతో.. సీసీ ఫుటేజీని పరిశీలించి, కూకట్పల్లి నల్లకుంట చెరువు కట్ట పార్క్‌కు చెందిన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 8 ద్విచక్ర వాహనాలు, గణేశ్మండపం వద్ద దొంగలించిన ఒక స్పీకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.