
సెప్టెంబర్‌లో బోసిపోయిన టాలీవుడ్‌కు అసలైన పండగను తీసుకురాబోతున్నాయి అక్టోబర్ మూవీస్. రాజమౌళి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. అదే రోజు జానస్ సంజయ్ మొదటి సినిమా ‘సిగ్మా’, ఆది సాయి కుమార్ ‘ఎస్ ఐ యుగంధర్’,’ తెల్లకాగితం’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సుమారు పది రోజుల పాటు వచ్చే దసరా సెలవుల్ని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు స్టార్ హీరోస్. వెంకటేష్ అండ్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 9న రాబోతోంది. తన ఫేవరేట్ హీరోతో అదే రోజు ఢీ అంటున్నాడు శ్రీ విష్ణు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అంటూ యాక్షన్ కామెడీ డ్రామాతో వస్తున్నాడు.
ఈ దసరాకు అసలు సిసలైన పోరు మొదలు కాబోతోంది. అక్టోబర్ 15న జైలర్2తో తమిళ్ బాక్సాఫీసే కాదు టాలీవుడ్ థియేటర్స్‌ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు రజనీకాంత్. టాలీవుడ్‌లో రజనీతో ఢీ కొడుతున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలితో అక్టోబర్ 16న ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. అక్టోబర్ 17న గరివిడి లక్ష్మీ అంటూ రాబోతుంది ఆనంది. పండగ అయిపోయినా మేము వస్తున్నాం అంటున్నారు మరికొంత మంది యంగ్ హీరోస్. విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ‘కల్ట్’ అక్టోబర్ 30న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు వయెలెన్స్,థ్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను, ఈసారి రొమాంటిక్ ఫిల్మ్ ‘ఏమో ఏమో ఇది’ మూవీతో వస్తున్నాడు. రోషన్, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన ఈ సినిమా.. అక్టోబర్ మంత్ ఎండింగ్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అనీష్ హీరోగా పరిచయమౌతోన్న ‘ఇట్లు అర్జున’ కూడా అక్టోబర్ 30న వస్తోంది. డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ మూవీని నిర్మిస్తున్నాడు.