Reading Time: < 1 minute

రైల్వే వ్యవస్థ వెనుక ఉన్న నల్లటి చరిత్ర ఇదే.. బ్రిటీషర్ల అసలు నైజం బయటపెట్టిన విజయ్-రష్మిక!

Caption of Image.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ హై-వోల్టేజ్ డ్రామా ‘రణబలి’. దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలోని అసలు కథేంటో..  అది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోందో చెప్పడానికి చిత్రబృందం ఏకంగా 4 ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్‌ను రంగంలోకి దించింది. ఈ కాన్సెప్ట్ ప్రమోషన్స్ ఇప్పుడు ఫిలిం వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన మొదటి ఎపిసోడ్‌లో బ్రిటీష్ పాలకులు మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ధాన్యాన్ని అక్రమంగా తరలించి, దాదాపు ఒక కోటి మంది భారతీయుల ప్రాణాలను తీసిన ‘కృత్రిమ కరువు’ (Man-made Famine) నేపథ్యాన్ని బయటపెడుతూ వీడియోను రిలీజ్ చేశారు.. ఇది కేవలం మనకు తెలిసిన సాధారణ స్వాతంత్ర్య పోరాటం కాదని, మన రక్త మాంసాలను పిండేసిన నల్లటి చరిత్ర అని స్పష్టం చేశారు.

లేటెస్ట్ గా విడుదలైన రెండో ఎపిసోడ్‌‌లో విజయ్ – రష్మికలు చెప్పిన విషయాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. భారత్‌లో బ్రిటీషర్లు రైల్వే వ్యవస్థను తీసుకొచ్చింది మన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కాదని.. మన దేశానికి చెందిన ధాన్యం, సుగంధ ద్రవ్యాలు, పత్తి, బంగారాన్ని అత్యంత వేగంగా పోర్టులకు తరలించి, అక్కడి నుంచి ఇంగ్లాండ్‌కు దోచుకెళ్లడానికేనని బాంబు పేల్చారు. చరిత్ర పుస్తకాలను కూడా వాళ్లే రాయడంతో ఈ ఘోరమైన సత్యాలను పాఠ్యాంశాల నుంచి పూర్తిగా తుడిచేశారని విజయ్ స్పష్టం చేశాడు. నాటి నిజాలు తెలుసుకుంటుంటే గుండెలు పిండేసినట్లవుతోందని రష్మిక తీవ్ర భావోద్వేగానికి గురైంది.

►ALSO READ | Irumudi OTT Record: ఓటీటీలోనూ రవితేజ మాస్ జాతర.. గ్లోబల్ ట్రెండింగ్‌లో నంబర్ 1గా ‘ఇరుముడి’!

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మన చరిత్ర పుస్తకాల్లో దాచేసి, ఇప్పటివరకు వెండితెరపై రాని ఈ విస్తుపోయే ఘట్టాలు ‘రణబలి’లో ఏ మేరకు చూపించబోతున్నారో ఆసక్తి నెలకొంది.

 

©️ VIL Media Pvt Ltd.