Reading Time: < 1 minute

పద్మారావునగర్: క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు పేరుతో మోసం..రూ.2 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు

Caption of Image.
  •     వ్యాపారి అకౌంట్​ నుంచి రూ.2 లక్షలు కాజేసిన సైబర్ ​నేరగాడు

పద్మారావునగర్, వెలుగు: క్రెడిట్ కార్డు రివార్డ్​పాయింట్లు, లిమిట్ పెంపు పేరుతో ఓ వ్యాపారిని సైబర్​నేరగాడు బురిడీ కొట్టించి రూ.2 లక్షలు కాజేశాడు. ఈ ఘటన రాంగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. సికింద్రాబాద్ నల్లగుట్ట ప్రాంతానికి చెందిన వ్యాపారి సికందర్ మొహ్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇటీవల ఏయూ బ్యాంక్ ప్రతినిధినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. కార్డు తీసుకుని 2 నెలలే కావడంతో, వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్ రివార్డ్ వోచర్ గడువు ఈరోజే ముగుస్తుందని నమ్మబలికాడు. దాన్ని నగదు రూపంలో బిల్లు చెల్లింపునకు వాడటం లేదా కార్డు పరిమితిని పెంచుకోవడం చేయొచ్చని చెప్పగా.. సికందర్​లిమిట్ పెంచాలని కోరాడు. 

తర్వాత సైబర్ కేటుగాడు చెప్పినట్లే అతను ప్లే స్టోర్ నుంచి ఏయూ0101 అనే యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసి, కార్డు వివరాలు నమోదు చేశాడు. అనంతరం ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఓటీపీని చెప్పడంతో కార్డు పరిమితి రూ.2 లక్షలకు పెరిగిందని, అయితే అది ఒక్కరోజు హోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుందన్నాడు. ఆ తర్వాత యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్ చేయాలని సూచించడంతో బాధితుడు అలాగే చేశాడు. కొద్దిసేపటికే క్రోమా పోర్టల్ ద్వారా బాధితుడి కార్డు నుంచి రూ.2 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే కార్డును బ్లాక్ చేసి, నేషనల్​సైబర్ క్రైం రిపోర్టింగ్​పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ సీసీపీఎస్ నుంచి అందిన జీరో ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాంగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ సురేశ్​కుమార్ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.