Reading Time: < 1 minute
Supreme Court On Diwali Crackers Specific Time Limit For Firecrackers

Diwali Crackers: దీపావళి టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా టపాసులపై పూర్తి నిషేధం విధించేందుకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. టపాసులపై పూర్తిగా నిషేధం విధిస్తే కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది.

అయితే 24 గంటల పాటు ఎక్కడ పడితే అక్కడ టపాసులు కాల్చడాన్ని అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టపాసుల కాల్చడం వల్ల అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. టపాసులు కాల్చేందుకు నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించడంతో పాటు.. ఏ రకమైన టపాసులను ఉపయోగించవచ్చో స్పష్టంగా పేర్కొంటామని సుప్రీంకోర్టు తెలిపింది.

ఇదిలా ఉండగా.. బేరియం పరీక్షలు, సంయుక్తంగా ఫైర్‌క్రాకర్ పరీక్షలు, టపాసుల శబ్ద తీవ్రతకు సంబంధించిన డెసిబెల్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB), కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరింత సమయం ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.