
మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్.. మెగాస్టార్ అంటేనే రికార్డులు. దశాబ్దాలుగా వెండితెరపై తనదైన స్టైల్‌తో అలరిస్తున్న చిరు.. ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోనూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారనే వార్త వైరల్‌గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి ఓ భారీ టాక్ షో చేయబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు మరింత హీట్ పెంచుతోంది. చిరంజీవికి ఈ ఒక్క షో కోసం ఏకంగా రూ.200 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే.. ఇండియన్ ఓటీటీ స్పేస్‌లోనే ఇది అత్యంత భారీ డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ రెమ్యునరేషన్‌పై నెట్‌ఫ్లిక్స్ లేదా చిరంజీవి టీమ్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Reports suggest Megastar Chiranjeevi is in advanced talks for a grand celebrity talk show on Netflix — and the reported remuneration? ₹200 CRORE! 💰🔥
With Unstoppable fame BVS Ravi working on the concept and Sushmita Konidela reportedly overseeing the deal, this could be one…
— Telugu Cinema Buzz (@telugucinemabuz) September 29, 2026
డాక్యుమెంటరీ కాదు.. పాడ్‌కాస్ట్ ఫార్మాట్‌లో చిరు!
ఇక ఈ షో కాన్సెప్ట్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలుత చిరంజీవిపై ఓ పూర్తిస్థాయి డాక్యుమెంటరీ రూపొందించాలని నెట్‌ఫ్లిక్స్ భావించినట్లు సమాచారం. అయితే.. చిరంజీవి మాత్రం తన కథను మరింత సహజంగా, వ్యక్తిగతంగా ప్రేక్షకులతో పంచుకునేలా పాడ్‌కాస్ట్ ఫార్మాట్‌పై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
ఈ ఫార్మాట్‌లో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, కెరీర్‌లో ఎదురైన ఎత్తుపల్లాలు, వ్యక్తిగత అనుభవాలు, ఇండస్ట్రీలో తనను ప్రభావితం చేసిన వ్యక్తులు, ఎన్నో ఏళ్లుగా అభిమానులకు తెలియని ఆసక్తికరమైన విషయాలను చిరంజీవి స్వయంగా పంచుకునే అవకాశం ఉందని టాక్. అంటే.. ఇప్పటివరకు ఇంటర్వ్యూల్లో చెప్పని ఎన్నో విషయాలకు ఈ షో వేదిక కానుందన్నమాట.
🎙️ #Chiranjeevi x #Netflix — A Meaningful New Journey!
Megastar #Chiranjeevi opens up about his preference for podcasts over documentaries, as they offer him the freedom to share his life experiences in a more personal and unfiltered way.
The podcast idea was brought to him by… pic.twitter.com/Jfvs9pIADG
— The Cine Gossips (@TheCineGossips) September 28, 2026
‘అన్‌స్టాపబుల్’ రైటర్.. చిరు షోకు కాన్సెప్ట్!
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షోకు కాన్సెప్ట్ రైటర్‌గా పనిచేసిన బీవీఎస్ రవి.. చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌కు కూడా కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో షోను కేవలం సాధారణ సెలబ్రిటీ ఇంటర్వ్యూలా కాకుండా.. చిరంజీవి వ్యక్తిత్వం, కెరీర్, అనుభవాలను కొత్త కోణంలో చూపించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తండ్రీకూతుళ్ల కాంబో.. నిర్మాణ బాధ్యతల్లో సుష్మిత!
ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న సుష్మిత.. ఇప్పుడు తన తండ్రితో కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది.
ALSO READ : టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌పై మరో ట్విస్ట్..
చిరు కెరీర్‌లోని అరుదైన జ్ఞాపకాలకు తెరలేపుతారా?
చిరంజీవి కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. హీరోగా ఎదిగిన రోజుల నుంచి స్టార్‌డమ్, రాజకీయ ప్రయాణం, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ వరకు ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన అధ్యాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలోని సీనియర్ నటీనటులతో తన అనుబంధం, కెరీర్‌ను మలుపు తిప్పిన సంఘటనలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అరుదైన జ్ఞాపకాలు ఈ షోలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని టాక్. అదే జరిగితే.. చిరంజీవిని ఇప్పటివరకు చూడని ఓ మరింత పర్సనల్, క్యాజువల్, అన్‌ఫిల్టర్డ్ అవతార్‌ను ప్రేక్షకులు చూడొచ్చు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే షో ఫార్మాట్, ఎపిసోడ్స్, రెమ్యునరేషన్ వంటి వివరాలపై పూర్తి క్లారిటీ రానుంది. అయితే.. నిజంగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే మాత్రం మెగాస్టార్ అభిమానులకు ఇది డిజిటల్ ఫీస్ట్ కావడం ఖాయం.
చిరంజీవి ‘కాకా’అప్‌డేట్!
చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు సమాచారం. కాగా, ఈ సినిమాలో చిరంజీవి కాదిరి కలిదాస్ అలియాస్ సత్యం పాత్రలో కనిపించనున్నారు. అనస్వర రాజన్, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం ఈ చిత్రాన్ని KVN Productions నిర్మిస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘కాకా’ థియేటర్లలోకి రానుంది.