Reading Time: < 1 minute
Ntr Birthday 2026 Dragon Glimpse Devara 2 And Trivikram Film Updates Expected

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్స్ రాబోతున్నాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా మూడు నాలుగు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రాబోతున్నట్టుగా టాక్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ఎన్టీఆర్ కొత్త సినిమాల అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ‘దేవర 2’ విషయంలో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

నిజానికి దేవర 2 కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొరటాల స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు. కానీ షూటింగ్ ఎప్పుడు?, అసలు ఈ సినిమా ఉంటుందా? అనే సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టైగర్ పుట్టినరోజు సందర్భంగా దేవర 2పై ఒక పవర్ ఫుల్ అప్‌డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై కూడా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా రానున్న ఈ సినిమాకు సంబంధించి తారక్ పుట్టినరోజు నాడు ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

Also Read: Shreyas Iyer Captaincy: శ్రేయాస్ అయ్యర్‌కు కాదు.. భారత జట్టుకే భారీ నష్టం!

అయితే దేవర 2, గాడ్ ఆఫ్ వార్ సినిమాల్లో ఏ సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దేవర 2 కాకుండా, డ్రాగన్ తర్వాత గాడ్ ఆఫ్ వార్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. అదే జరిగితే దేవర 2 ఇప్పట్లో కష్టమే. మరోవైపు కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్, ఎన్టీఆర్ కలయికలో ఓ సినిమా ఉండబోతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈసారి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు టాక్. చూడాలి మరి ఈసారి బర్త్ డేకి ఎన్ని అప్డేట్స్ ఉంటాయో.