Reading Time: 2 minutes
Delhi Police Releases Video On Travel Offer To Abhijeet Dipke After Grandmothers Death

Police VS CJP: ఢిల్లీ పోలీసులు, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కన్వీనర్ అభిజిత్ దీప్కే మధ్య వివాదం ఏర్పడింది. తనను కస్టడీలో ఫోన్ వాడుకోవడానికి పోలీసులు అనుమతించలేదని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ఢిల్లీ పోలీసులు అభిజిత్ దీప్కేకు తన నానమ్మ మరణం, ఫోన్ వాడుకోవడానికి పోలీసులు అనుమతి ఇస్తుండటం వీడియోలో కనిపించింది.

అభిజిత్ దీప్కే తన ఆరోపణల్లో.. ఢిల్లీ పోలీసులు తన న్యాయవాదితో మాట్లాడటానికి అనుమతించలేదుని, తెల్లవారుజామున 3.30 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి, తాను చాలా కాలం జైలులో ఉంటానని చెప్పమని అధికారులు తనను ఎందుకు అడిగారని ప్రశ్నించారు. మరణించిన తన నానమ్మ వద్ద ఉండే కజిన్‌తో మాట్లాడటానికి పోలీసుల్ని అనుమతి కోరానని, కజిన్ నెంబర్ కోసం తన ఫోన్ కావాలని అడిగానని చెప్పారు. తన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారని ఆరోపించారు.

అయితే, దీప్కే ఆరోపణల్ని తిప్పికొట్టిన ఢిల్లీ పోలీసులు అందుకు సాక్ష్యంగా వీడియోను రిలీజ్ చేశారు. నానమ్మ మరణం, అంత్యక్రియల సమయాలను దీప్కేకు తెలియజేసిన తర్వాత పోలీసులు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు పలుమార్లు ముందుకొచ్చారు. బస్సు, విమానం, ఇతర మార్గాల్లో ప్రయాణించేందు ఏర్పాట్లు చేస్తామని ఓ అధికారి చెప్పినట్లు పోలీసులు విడుదల చేసిన వీడియోలో వినిపిస్తోంది. కుటుంబీకులతో మాట్లాడటానికి కూడా దీప్కేక పోలీసులు అవకాశం ఇచ్చారు. దీనికి తన నాన్నతో మాట్లాడలేను అని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.