Reading Time: < 1 minute
Pm Modis Message To Gen Z In Chennai Dream Big Think Differently

PM Modi: ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు అందించే సామర్థ్యం యువతలో ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. యువత తమ భవిష్యత్తును విశాల దృక్ఫథంతో చూడాలని, పెద్ద కలలు కనాలని, కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇది యువతకు సరైన సమయమని, తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశమని పేర్కొన్నారు. చెన్నై లోని నందంబాక్కంలో చెన్నై ట్రేడ్ సెంటర్‌లో జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.

అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి అవసరమైన కొత్త ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తును మాత్రమే కాకుండా ప్రపంచ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతాయని ప్రధాని అన్నారు. భారత్‌లో యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. తాను వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, కాశీ ప్రతినిధినని మోడీ అన్నారు. ప్రముఖ కవి సుబ్రమణ్య భారతి రచనల్ని ప్రస్తావిస్తూ.. యువత భయం లేకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీలో ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా యువత నిరసన తెలుపుతున్న సమయంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. యువత ఆలోచనలతో పనిచేయాలని, పెద్ద కలలు కనాలని, భిన్నంగా ఆలోచించాలని, నిర్భయంగా ముందుకు సాగాలని సూచించారు. దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, సమిష్టిగా పనిచేస్తే లక్ష్యాలు సాధించవచ్చని అన్నారు.