Reading Time: 2 minutes

2036 ఒలింపిక్స్ ఆతిథ్యమే భారత్ లక్ష్యం.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!

Caption of Image.

2036 Olympics India: భారతదేశం క్రీడారంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 2036 ఒలింపిక్ గేమ్స్ (2036 Olympic Games) ఆతిథ్య హక్కులను దక్కించుకోవడమే లక్ష్యంగా ఇండియా ముందుకు కొనసాగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈరోజు (అక్టోబర్ 11, 2026 ఆదివారం) చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. క్రీడారంగంలో దేశ యువత సాధిస్తున్న పురోగతి, రాబోయే మెగా ఈవెంట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం: 

ఈ సందర్భంగా విద్యార్థులు, క్రీడాభిమానులను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత్‌ ప్రస్తుతం 2030 కామన్వెల్త్ గేమ్స్ (CWG 2030) నిర్వహణకు అహ్మదాబాద్ వేదికగా సిద్ధమవుతోంది. దాంతో పాటు 2036 ఒలింపిక్స్ గేమ్స్‌కు ఆతిథ్యమివ్వాలనే బిగ్ డ్రీమ్‌తో వేగంగా ముందుకు అడుగులు వేస్తోందని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీలు మన దేశంలోనే జరుగుతాయని, తద్వారా దేశీయ యువ అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, శిక్షణ, సరైన వేదిక లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రికెట్, ఇతర క్రీడలను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా.. యువత వాటిని ఒక అద్భుతమైన కెరీర్‌గా మలచుకునేలా ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

ఒలింపిక్స్ రేసులో భారత్: 

* 2036 ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్ నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) కి భారత్ ఇప్పటికే తన అధికారిక ప్రతిపాదనను (Letter of Intent) సమర్పించింది.

* మిగతా పోటీదారులు: ఈ రేసులో భారత్‌తో పాటు జర్మనీ, హంగేరీ, ఖతార్, దక్షిణ కొరియా, సౌత్ ఆఫ్రికా, టర్కీలు ఉన్నాయి.

* ఎంపిక సమయం: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మార్చి 2027 నాటికి షార్ట్‌లిస్ట్ చేసిన నగరాల జాబితాను విడుదల చేస్తుంది. అనంతరం 2029 మధ్యలో ఐఓసీ సభ్యులు ఓటింగ్ ద్వారా 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని అధికారికంగా ఎన్నుకుంటుంది. 

చెన్నై పర్యటన: మెట్రో ఫేజ్-2 ప్రారంభం: 

తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (C. Joseph Vijay) తో కలిసి చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 నెట్‌వర్క్‌లోని పోరూర్ నుంచి పూనమల్లే వరకు మొదటి మెట్రో రైలు సేవలను ప్రధాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఇరువురు నేతలు మెట్రో రైలులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు.

©️ VIL Media Pvt Ltd.