
హైదరాబాద్, ఏప్రిల్ 8: సీఏ ఇంటర్మీడియట్ 2026 పరీక్షల తేదీలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మార్పు చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మే 3వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కావల్సి ఉంది. అయితే ఈ తేదీలను ICAI రీషెడ్యూల్ చేసింది. తాజా ప్రకటన మేరకు ఈ పరీక్షలు మే 5 నుంచి మొదలు కానున్నాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం సీఏ ఇంటర్మీడియట్ గ్రూప్ 1 పరీక్షలు మే 5, 7, 9 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షలు మే 11, 13, 15 తేదీల్లో జరగనున్నాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అయితే ఫౌండేషన్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సు (INTT-AT)తో సహా ఇతర పరీక్షల షెడ్యూల్‌లో మాత్రం ఎటువంటి మార్పులు లేదని, యథాతథంగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఐసీఏఐ స్పష్టం చేసింది.
Re-Scheduling of Chartered Accountants’ Intermediate Examination, Scheduled from 3rd May 2026 across India and Abroad
For details please visithttps://t.co/MUD6vbK72u pic.twitter.com/QKCKqUkJaf
— Institute of Chartered Accountants of India – ICAI (@theicai) April 7, 2026
Important Announcement – Chartered Accountants Final Examination to be held twice a year from May 2026 Examination onwards.
For details pl visithttps://t.co/6tBqxbF40P pic.twitter.com/nsoXTBZebX
— Institute of Chartered Accountants of India – ICAI (@theicai) April 7, 2026
మరోవైపు సీఏ ఫైనల్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఐసీఏఐ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఏడాదికి మూడుసార్లు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. యేటా జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లో సీఏ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షలను ఇకపై ఏడాదికి రెండు సార్లు మాత్రమే నిర్వహించాలని ICAI నిర్ణయించింది. ఈ కొత్త విధానం ఈ ఏడాది మే సెషన్ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. విద్యార్ధుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఏఐ జాయింట్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ చతుర్వేది అధికారికంగా ప్రకటించారు. తాజా మార్పుల నేపథ్యంలో ఇకపై ఈఏ ఫైనల్ పరీక్షలు కేవలం మే, నవంబర్ నెలల్లో మాత్రమే జరగనున్నాయి.
పరీక్షల నిర్వహణలో ఏర్పడుతున్న ఆటంకాల నేపథ్యంలో విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు ఐసీఏఐ జాయింట్ డైరెక్టర్ (ఎగ్జామినేషన్స్) ఆనంద్ కుమార్ చతుర్వేది వివరించారు. పరీక్షల మధ్య తగినంత విరామం ఉండాలని, సిలబస్ ప్రిపరేషన్‌కు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు బోర్డు వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.