July 10, 2026

Abrar Ahmed: ఈసారి సన్‌రైజర్స్ తరపున ఆడని పాక్ ప్లేయర్ అహ్మద్‌.. ఎన్‌వోసీ ఇవ్వని పీసీబీ

Abrar Ahmed: ఈసారి సన్‌రైజర్స్ తరపున ఆడని పాక్ ప్లేయర్ అహ్మద్‌.. ఎన్‌వోసీ ఇవ్వని పీసీబీ
Reading Time: 2 minutes

Abrar Ahmed: ఈసారి సన్‌రైజర్స్ తరపున ఆడని పాక్ ప్లేయర్ అహ్మద్‌.. ఎన్‌వోసీ ఇవ్వని పీసీబీ

Caption of Image.

Abrar Ahmed: ఇంగ్లాండ్ లో జరగబోతయే ది హండ్రెడ్ లీగ్‌లో భాగంగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేయడంపై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమే దీనికీ ఓనర్. దీంతో పాక్ క్రికెటర్‌ను టీమ్ లోకి ఎలా తీసుకుంటారని ఇండియన్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ జట్టుని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. దీంతో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఎడిషన్ లో అబ్రార్ అహ్మద్ ‘ది హండ్రెడ్ లీగ్’లో ఆడే ఛాన్స్ లు లేవని క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది.  

కాగా ఇప్పటి వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి అబ్రార్‌కు నిరభ్యంతర పత్రం మాత్రం ఇంకా రాలేదు. ఇంగ్లిష్ లీగ్ సమయంలోనే పాక్ టీమ్ వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు ప్రణాళికలను రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో జాతీయ జట్టు బాధ్యతలను మదిలో పెట్టుకుని అబ్రార్‌కు ఎన్‌వోసీ ఇవ్వకూడది పాకిస్తాన్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి, ది హండ్రెడ్ లీగ్‌లో అబ్రార్ ఆడకపోవచ్చని తెలుస్తుంది. ఆ లీగ్ సమయంలోనే దాయాది దేశం రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఆడనుంది. వేలంలో పాల్గొంటే భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి. 

అబ్రార్ తరఫున అతడి ఏజెంట్ ది హండ్రెడ్ లీగ్ వేలంలో పేరు ఫైల్ చేశాడు. పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఎన్‌వోసీ వస్తుందనే నమ్మకంతో ఇలా చేసినట్లు సమాచారం. పీసీబీతో అతడికి మంచి సంబంధం ఉండటంతో.. అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ తో అబ్రార్ అహ్మద్ ది హండ్రెడ్ లీగ్‌లో ఆడే ఛాన్స్ లు కేవలం 50 శాతం మాత్రమే ఉన్నాయి. ఎన్‌వోసీ ఇవ్వకపోతే ఈసారి లీగ్‌లో ఆడే అవకాశం అతడికి ఉండదని పాక్ క్రికెట్ బోర్డులు వర్గాలు తెలిపాయి. కాగా ది హండ్రెడ్ లీగ్ జులై 21 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు జరగనుంది. వెస్టిండీస్ టూర్ కి పాక్ కూడా జులై 15న వెళ్లనుంది. ఆగస్టు 7వ తేదీ వరకు రెండు టెస్టులు ఆడుతుంది.  

 

©️ VIL Media Pvt Ltd.