July 10, 2026

ఇళ్ల గ్యాస్ బండలకు ఇబ్బంది లేదు.. అవసరం లేకపోయినా బుక్ చేయొద్దు : మంత్రి ఉత్తమ్

ఇళ్ల గ్యాస్ బండలకు ఇబ్బంది లేదు.. అవసరం లేకపోయినా బుక్ చేయొద్దు : మంత్రి ఉత్తమ్
Reading Time: < 1 minute

ఇళ్ల గ్యాస్ బండలకు ఇబ్బంది లేదు.. అవసరం లేకపోయినా బుక్ చేయొద్దు : మంత్రి ఉత్తమ్

Caption of Image.

 తెలంగాణలో గృహ వినియోగదారులకు  గ్యాస్ కొరత లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కమర్షియల్ గ్యాస్  సిలిండర్ల కొరత మాత్రమే ఉందని చెప్పారు.ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అవసరంగ లేకున్నా ముందస్తుగా గ్యాస్ బుక్ చేసుకోవద్దని సూచించారు ఉత్తమ్.   కావాలని  గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఎల్పీజీ ఆయిల్ సరఫరా సంస్థలతో ఇవాళ రివ్యూ చేసిన మంత్రి ఉత్తమ్..‘ ప్రస్తుత పరిస్థితులపై నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాం. రాష్ట్రంలో 810 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ లు ఉన్నారు. 1.3 కోట్ల డోమాస్టిక్ కన్జుమర్స్ ఉన్నారు. 7.5 లక్షల కమర్షియల్ కన్జుమర్స్ ఉన్నారు. నెలకు యావరేజ్ 60 లక్షల సిలిండర్లు  డొమెస్టిక్ వాడుతున్నారు. కమర్షియల్ సిలిండర్ విషయంలోనే కొరత ఏర్పడుతోంది. డొమాస్టిక్ కన్జుమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎలాంటి కొరత లేదు. ఆందోళనతో ముందస్తుగా అవసరం లేకున్నా గ్యాస్  బుక్ చేసుకుంటున్నారు. గృహ అవసర సిలిండర్లకు కొరత లేదు. కమర్షియల్ సిలిండర్లను కేంద్రం  20 శాతం సప్లై   చేస్తోంది’. 

►ALSO READ | ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ.. రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగు చేయండి: మంత్రి తుమ్మల

‘కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రానికి లేఖ రాశాం. ప్రతి రోజు 2.15 లక్షల ఎల్పీజీ డొమాస్టిక్ సిలిండర్లు సప్లై చేస్తారు. నిన్న మొన్న 2.3 లక్షలు సప్లై చేశారు. కమర్షియల్ సిలిండర్లు రోజుకు 23 వేలు సప్లై చేసే వాళ్లు. కానీ ప్రస్తుతం 6200 సిలిండర్లు మాత్రమే ఇస్తున్నారు. స్కూల్స్, కాలేజెస్, సెంటర్, స్టేట్ గవర్నమెంట్ సంస్థలకు కమర్షియల్ సిలిండర్లు విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నాం.  సివిల్ సప్లై భవన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని. ఎవరైన కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించినా..బ్లాక్ మార్కెట్ చేసినా హెల్ఫ్ లైన్  180042500344 కు కాల్ చేయొచ్చని’ మంత్రి ఉత్తమ్ చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.