July 10, 2026

Vastu Tips : దేవుడికి ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి.. లైట్లకు సంబంధం ఏంటీ..

Vastu Tips : దేవుడికి ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి.. లైట్లకు సంబంధం ఏంటీ..
Reading Time: < 1 minute

Vastu Tips : దేవుడికి ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి.. లైట్లకు సంబంధం ఏంటీ..

Caption of Image.

హిందువులు దేవుడిని ఆరాధించే విషయంలో ఎలా పూజ చేయాలి.. ఏ పూజకు ఎన్ని అగర్​ బత్తీలు వెలిగించాలి. అవి ఏదిక్కున పెట్టాలి.  ఇలాంటి ప్రశ్నలతో  సతమతమవుతుంటారు.  అసలు దేవుడికి ఎన్ని అగర్​ బత్తీలు వెలిగించాలో భారత వాస్తు విజ్ఞాన సర్వజ్ఞ, ఆలయ బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు గతంలో ఇచ్చిన సూచనలతో పాటు నెగిటివ్​ ఎనర్జీ అంటే ఏమిటో చక్కగా వివరించారు.  ఇప్పుడు వాటి గురించి  తెలుసుకుందాం.

ప్రశ్న: రోజూ ఉదయం దీపారాధన చేస్తాను. ఆ సమయంలో దేవుడికి అగర్ బత్తీలు వెలిగించడం అలవాటు. అలాగే వా రానికి రెండుసార్లు సాంబ్రాణీ కడ్డీలు పెడుతుంటాను. అయితే ఈ మధ్య మాకు తెలిసిన ఒక పెద్ద మనిషి, ఇంట్లో దేవుడికి వెలిగించే అగర్ త్తీలకు ఒక లెక్క ఉంటుంది. ఇష్టమొచ్చినట్టు ఎన్నంటే అన్ని పెట్టొద్దని చెప్పారు. కేవలం బేసి సంఖ్యలోనే వాటిని వెలిగించాలన్నారు. అది నిజమేనా? సాంబ్రాణీ కడ్డీలుపెట్టడం మంచిదేనా?

జవాబు:  ప్రస్తుతం బయట రోజుకోరకంగా చెప్పున్నారు తప్ప…. అసలు దేవుడికి వెలిగించే అగర్ బత్తీలకు లెక్క లేదు. ఎప్పుడైనా ఇంట్లో దుష్ప్రభావాలు ఉన్నట్లు అనుమానంగా అనిపిస్తే సాయంత్రం ఆరు గంటలకు సాంబ్రాణీ కడ్డీలు, గుగ్గిలం లాంటి వాటితో పొగ వేయడం మంచిది. కానీ వాటికీ లెక్క ఏమీ ఉండదు

ప్రశ్న:  వాస్తు గురించి తెలుసుకుంటున్న ప్పుడు ‘నెగెటివ్ ఎనర్జీ’ అనే పదాన్ని వింటున్నాను. అసలు దాని అర్ధం ఏంటి?

జవాబు: కొందరు ఇల్లు కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు. తర్వాత ఏ కారణం వల్లనో అందులోకి గృహప్రవేశం చేయరు. అప్పుడు ఆ ఇల్లు కొన్ని రోజుల వరకు ఖాళీగా ఉండటం వల్ల దీపారాధన ఉండదు. ఎప్పుడైనా దీపా రాధన లేని ఇంటిని, మనుషులెవరూ లేరు కదా అని క్షుద్ర శక్తులు ఆక్రమిస్తా యి. దాన్నే నెగెటివ్ ఎనర్జీ అంటారు. అందుకే ఊళ్లకు వెళ్లేటప్పుడు కూడా ఇంట్లో లైట్ వేసి వెళ్లాలని చెబుతుంటారు. 

©️ VIL Media Pvt Ltd.