July 10, 2026

IIIT Basara: తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

IIIT Basara: తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల
Reading Time: < 1 minute

IIIT Basara: తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

Caption of Image.

తెలంగాణలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆర్జీయూకేటీ బాసర వీసీ గోవర్దన్ శుక్రవారం (మార్చి 13)  నోటిఫికేషన్కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. 2026 మార్చి18 నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. అడ్మిషన్ల దరఖాస్తు కు చివరితేది 20.05.2026 గా పేర్కొన్నారు. 

తెలంగాణలో ఉన్న బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలకు సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం  అధికారిక వెబ్ సైట్  https://www.rgukt.ac.in/ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి. ప్రొఫెసర్ ఈ మురళి దర్శన్, అడ్మిషన్  కన్వీనర్ శీలం శేఖర్, కో- కన్వీనర్ బండి హరికృష్ణ, అసోసియేట్ డీన్స్ డా. మహేష్, డా. విటల్, డా. దేవరాజ్, సునీత మొదలైన వారు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.