Reading Time: < 1 minute
Netanyahu Confirms Death Of Top Iranian Nuclear Scientist In Israeli Airstrike

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కీలక నేతలు హతమయ్యారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.

ఇజ్రాయెల్ జరిపిన వాయు దాడుల్లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతిచెందినట్టు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. గురువారం రాత్రి మీడియా సమావేశంలో నెతన్యాహు మాట్లాడారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరొక అగ్రశ్రేణి ఇరానియన్ అణు శాస్త్రవేత్త మరణించాడని పేర్కొన్నారు. అలాగే పలువురు గాయపడినట్లుగా తెలిపారు.

ఈ సందర్భంగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని తీవ్రంగా విమర్శించారు. మోజ్తాబా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మగా అభివర్ణించారు. అందుకు ఉదాహరణే ఇప్పటి వరకు బహిరంగంగా మోజ్తాబా కనిపించకపోవడమే అన్నారు. ఈ సందర్భంగా ఇరాన్ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. ‘‘కొత్త స్వేచ్ఛా మార్గం కోసం సమయం ఆసన్నమైందని.. వారికి ఇజ్రాయెల్ అండగా నిలుస్తుందని.’’ అని పిలుపునిచ్చారు. అంతా మీ చేతుల్లోనే ఉందని ఇరాన్ ప్రజలకు నెతన్యాహు సూచించారు.

ఇది కూడా చదవండి: US aircraft crash: ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.!