July 10, 2026

అలిపిరి లగేజి కౌంటర్ పరిశీలించిన టీటీడీ ఈవో రవిచంద్ర

అలిపిరి లగేజి కౌంటర్ పరిశీలించిన టీటీడీ ఈవో రవిచంద్ర
Reading Time: < 1 minute

అలిపిరి లగేజి కౌంటర్ పరిశీలించిన టీటీడీ ఈవో రవిచంద్ర

Caption of Image.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందించేందుకు అలిపిరి దగ్గర ఏర్పాటు చేసిన లగేజి కౌంటర్ ను పరిశీలించారు టీటీడీ ఈవో రవిచంద్ర. గురువారం ( మార్చి 12 ) టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణతో కలిసి తనిఖీలు నిర్వహించారు ఈవో రవిచంద్ర.

భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో తమ లగేజిని కౌంటర్‌లో డిపాజిట్ చేయగా, వాటిని భద్రంగా తిరుమలకు తరలించే విధానంపై అధికారులు ఈవోకు వివరించారు. లగేజి డిపాజిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా రూపొందే క్యూఆర్ కోడ్‌తో కూడిన రసీదు భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

సాధారణ రోజుల్లో సుమారు 6 వేల బ్యాగులు, ప్రత్యేక పర్వదినాల్లో 10 వేల వరకు బ్యాగులు తిరుమలకు భద్రంగా రవాణా చేస్తున్నట్లు  వివరించారు అధికారులు.అనంతరం ఈవో లగేజి కౌంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.

©️ VIL Media Pvt Ltd.