July 10, 2026

Rashmika Mandanna: ఎనిమిదేళ్లుగా రష్మికకు వేధింపులు.. 24 గంటల్లోనే వారి సంగతి తేలుస్తానంటూ వార్నింగ్!

Rashmika Mandanna: ఎనిమిదేళ్లుగా రష్మికకు వేధింపులు.. 24 గంటల్లోనే వారి  సంగతి తేలుస్తానంటూ వార్నింగ్!
Reading Time: < 1 minute

Rashmika Mandanna: ఎనిమిదేళ్లుగా రష్మికకు వేధింపులు.. 24 గంటల్లోనే వారి సంగతి తేలుస్తానంటూ వార్నింగ్!

Caption of Image.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న..తనపై గత 8 ఏళ్లుగా జరుగుతున్న ట్రోలింగ్‌, తప్పుడు ప్రచారాలపై స్పందించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ నోట్‌లో ఒక వర్గం మీడియా, కొంతమంది ఆన్‌లైన్ వ్యక్తులు తన మాటలను తప్పుగా చూపిస్తూ అసత్య కథనాలు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణను తన అనుమతి లేకుండా రికార్డు చేసి, అందులోని కొంత భాగాన్ని మాత్రమే బయటకు తీసి కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనతో తన కుటుంబ సభ్యులు, సన్నిహితులను కూడా అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని తెలిపారు.

ALSO READ : విజయ్ ‘జన నాయగన్’కు మరో బిగ్ షాక్! రూ. 120 కోట్ల ఓటీటీ డీల్ రద్దు?

ఇప్పటివరకు ఈ దాడులు తనకే పరిమితమై ఉండడంతో మౌనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు ఫ్యామిలీని కూడా లక్ష్యంగా చేసుకోవడంతో ఇక మౌనంగా ఉండలేనని రష్మిక స్పష్టం చేశారు. ఈ వ్యవహారం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా నిందారోపణ ప్రచారమని ఆమె వెల్లడించింది.

ఈ 24 గంటల్లోనే వేధింపులు మరింత ఎక్కువయ్యాయని.. ఇక వీటిపై ఊరుకునేది లేదని హెచ్చరించింది రష్మిక. ఈ క్రమంలోనే 24 గంటల్లో ఆ కంటెంట్ ను తొలిగించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

అయితే, రష్మిక మందన్న వ్యాఖ్యలు, గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్‌మెంట్ రద్దు వివాదానికి సంబంధించినవేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ఆ సమయంలో జరిగినట్లు చెప్పబడుతున్న ఒక పాత ప్రైవేట్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మళ్లీ చర్చకు వచ్చింది.

©️ VIL Media Pvt Ltd.